Nara Lokesh: సమస్యలపై సమాధానం చెప్పలేక మార్షల్స్ తో అడ్డుకుంటున్నారు: నారా లోకేశ్

  • టీడీపీ సభ్యులకు మార్షల్స్ కు మధ్య వాగ్యుద్ధం
  • చంద్రబాబును అవమానించారన్న నేతలు
  • మండలి వద్ద సభ్యులతో మార్షల్స్ వాదనలు
తమను అసెంబ్లీ ప్రాంగణంలోనికి రానివ్వకుండా గేట్లకు తాళాలు వేశారంటూ టీడీపీ సభ్యులు నిన్న మార్షల్స్ తో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దిగడం తెలిసిందే. అధినేత చంద్రబాబునాయుడిని, ఇతర సభ్యులను అడ్డుకుని అవమానించారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా,  మార్షల్స్ తో మండలి సభ్యుల వాదనలను నారా లోకేశ్ ఓ వీడియో రూపంలో పోస్టు చేశారు. సభ్యుల హక్కులు హరించడానికి వీల్లేదని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మార్షల్స్ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో ప్రజాసమస్యలు చర్చకు వస్తే సమాధానం చెప్పాలన్న భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా మార్షల్స్ తో సభ్యులను అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Assembly
Canada
YSRCP
Jagan

More Telugu News