Rahul Gandhi: నేను క్షమాపణలు చెప్పను.. కాసేపట్లో ఓ వీడియోను ట్వీట్ చేస్తాను: రాహుల్ గాంధీ

  • ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా గతంలో మోదీ పేర్కొన్నారు
  • ఇందుకు సంబంధించిన క్లిప్ నా ఫోనులో ఉంది
  • పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్ లో ఆందోళనలు
  • అందరి దృష్టినీ పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది  
'రేప్ ఇన్ ఇండియా' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని లోక్ సభలో బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నేను క్షమాపణలు చెప్పను. ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన క్లిప్ నా ఫోనులో ఉంది. ఈ క్లిప్ ను నేను ట్వీట్ చేస్తాను.. ప్రతి ఒక్కరు చూడొచ్చు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్ లో చెలరేగుతోన్న ఆందోళనల నుంచి అందరి దృష్టిని పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది' అని చెప్పారు.
Rahul Gandhi
Congress
BJP

More Telugu News