Locket Chatterjee: భారత మహిళలతో పాటు భారత మాతాను రాహుల్ గాంధీ అవమానించారు: మహిళా ఎంపీ లాకెట్ ఛటర్జీ

  • మేక్ ఇన్ ఇండియా అని మోదీ పిలుపునిచ్చారు
  • కానీ, రాహుల్ గాంధీ మాత్రం రేప్ ఇండియా అని అంటున్నారు
  • అత్యాచారం చేయాలని ప్రతి ఒక్కరికీ ఆయన పిలుపునిస్తున్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ మండిపడ్డారు. ఈ రోజు లోక్ సభలో ఆమె మాట్లాడుతూ... 'మేక్ ఇన్ ఇండియా అని మోదీ పిలుపునిచ్చారు.. కానీ, రాహుల్ గాంధీ మాత్రం రేప్ ఇన్ ఇండియా అని అంటున్నారు. అంటే అత్యాచారం చేయాలని ప్రతి ఒక్కరికీ ఆయన పిలుపునిస్తున్నారు. ఇది భారత మహిళలతో పాటు భారత మాతాను అవమానించడమే' అని వ్యాఖ్యానించారు.

కాగా, కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కూడా ఇటీవల లోక్ సభలో మాట్లాడుతూ  'మేక్ ఇన్ ఇండియా నుంచి భారత్ మెల్లిగా రేప్ ఇన్ ఇండియా దిశగా వెళ్తోంది' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Locket Chatterjee
BJP
Rahul Gandhi

More Telugu News