Assembly: సభలోకి రావడం సభ్యుల హక్కు...వారిని అడ్డుకోవడం ఏమిటి? : టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

  • గేటుకు తాళాలు వేయడంపై నిలదీసిన ఎమ్మెల్యే
  • ఏపీ ప్రభుత్వం తీరు సిగ్గుచేటు
  • అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

అసెంబ్లీ ఆవరణలోకి రావాల్సింది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలేనని, వారిని రాకుండా గేట్లకు తాళాలు వేయడం ఏమిటని టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. విపక్ష సభ్యుల పట్ల ఏపీ ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌, టీడీపీ సభ్యుల మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య తీవ్రవాగ్యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సభ్యులకు అసెంబ్లీలోకి వచ్చే హక్కు ఉందా? లేదా? అన్నదానిపై ముందు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

నిన్న గేటు వద్ద ఉన్న వారంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలేనని, మరి వారిని లోనికి రానివ్వక పోవడం ఏమిటని ప్రశ్నించారు. విపక్ష నాయకుడి చేతిలో కాగితాలు లాక్కోవడం ఎంతవరకు న్యాయమన్నారు. చంద్రబాబు అనని మాటలు అన్నారని అంటున్నారని, సభలో లేని లోకేష్‌ గురించి మాట్లాడుకోవడం ఏమిటని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.

More Telugu News