Imran khan: పరిస్థితి చేయి దాటకముందే అడ్డుకోండి: పౌరసత్వ బిల్లుపై ప్రపంచానికి ఇమ్రాన్ పిలుపు

  • మోదీ హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారు
  • అణుయుద్ధ బెదిరింపుల వల్ల భారీ రక్తపాతం జరుగుతుందన్న ఇమ్రాన్
  • ఇమ్రాన్‌కు ఘాటుగా కౌంటరిచ్చిన భారత్
భారత పౌరసత్వ సవరణ బిల్లుపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని, ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని సూచించారు. కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ అంతే ఘటుగా సమాధానం ఇచ్చింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు.
Imran khan
Pakistan

More Telugu News