Catherin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలకృష్ణ సరసన కేథరిన్ 
  • ప్రభాస్ 'జాన్' అప్ డేట్స్ 
  • వెంకీ 'అసుర' షూటింగ్ షెడ్యూల్ 
*  బాలకృష్ణ సరసన కథానాయికగా కేథరిన్ త్రెసా నటించనుంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించే భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ను ఓ హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం.
*  రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'జాన్' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల రెండు నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇందుకోసం ఫిలిం సిటీలో పారిస్ నగరాన్ని పోలిన సెట్స్ వేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  తమిళంలో హిట్టయిన 'అసుర' చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. విరామం లేకుండా చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Catherin
Balakrishna
Prabhas
Venkatesh
Pooja Hegde

More Telugu News