Andhra Pradesh: ఏపీ అధికారిక కార్యక్రమంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి.. మంత్రి వెల్లంపల్లి హర్షం

షార్ట్స్‌లో చూడండి
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి వెల్లంపల్లి, పొట్టిశ్రీరాములు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు  తీసుకోవాల్సిందిగా అన్నిప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Pottisriramulu
Minister
Vellampalli

More Telugu News