vijayasaireddy: విజయసాయిరెడ్డి గారూ! గుంటూరుని ‘గుండూరు’ అనే వ్యక్తి మన ముఖ్యమంత్రా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు: బుద్ధా వెంకన్న

  • నారా లోకేశ్ పై విజయసాయి విమర్శలకు కౌంటర్
  • నిరక్షరాస్యతను ‘నిరారక్షిత’ అని మన సీఎం అంటారు
  • టూ వీలర్ కి టోల్ కట్టించిన చిట్టి రెడ్డి మన ముఖ్యమంత్రి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేయడం..అందుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్లు ఇవ్వడం కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేత నారా లోకేశ్ ను విమర్శిస్తూ విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న స్పందించారు. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘గుంటూరుని గుండూరు అనే వ్యక్తి, నిరక్షరాస్యతను నిరారక్షిత అని, టూ వీలర్ కి టోల్ కట్టించిన చిట్టి రెడ్డి మన ముఖ్యమంత్రా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు’ అంటూ ఓ ట్వీట్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
vijayasaireddy
Buddha venkanna
Jagan
cm

More Telugu News