Telugudesam: ‘సాక్షి’ దొంగ పేపర్ అని ఒప్పుకున్నందుకు జగన్ కి అభినందనలు: నారా లోకేశ్

  • సీఎం జగన్ పై మరోమారు విరుచుకుపడ్డ లోకేశ్  
  • ఈ పేపర్ లో రాసే వార్తలన్నీ అబద్ధాలే, అసత్యాలే
  • ఆ విషయాన్ని నిండు సభ సాక్షిగా జగన్ ఒప్పుకున్నారు
సీఎం జగన్, సాక్షి పేపర్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విరుచుకుపడ్డారు. ఈ పేపర్ లో రాసే వార్తలన్నీ అబద్ధాలే, అసత్యాలే అని నిండు సభలో జగన్ ఒప్పుకున్నారంటూ ఓ పోస్ట్ చేశారు. ఇంత కాలం ఇలాంటి వార్తలు ప్రచురించి ప్రజలను బురిడీ కొట్టించిన ‘సాక్షి’ దొంగ పేపర్ అని ఒప్పుకున్న జగన్ కు అభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నానంటూ సెటైర్లు విసిరారు. సాక్షి పేపర్ లో గతంలో ప్రచురితమైన కథనాలు ’చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!’, ‘ఇక సన్నబియ్యం సరఫరా’,‘డేటా చోర్.. బాబు సర్కార్’, ‘నాలుగేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు’, ‘కారు మబ్బులు’, ‘బాబు అవినీతి ఆకాశయానం’ లను ప్రస్తావిస్తూ జగన్ పై లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Telugudesam
Nara Lokesh
cm
Jagan
YSRCP

More Telugu News