gollapudi: గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

  • తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడిన సీఎం
  • ఆయన పరిశోధనాత్మక రచనలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయి
  • ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80)  చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని అన్నారు. సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల సినీనటుడు కోట శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. 
gollapudi
Tollywood
KCR
Talasani

More Telugu News