Vijay Sai Reddy: అలా మాట్లాడితే మీరన్నట్టు ప్రాజెక్టులేమీ ఆగిపోవు చిట్టి నాయుడు: విజయసాయి రెడ్డి

  • గతంలో వర్ధంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడారు
  • ఇంతటి జ్ఞాని మనకు మంత్రిగా పనిచేశాడా? అని ప్రజల మనసులు క్షోభించాయి
  • విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడు
  • చంద్రబాబు నాయుడి కొడుకు అవడం వల్లనే ఇది సాధ్యమైంది   
టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు కావడం వల్లే లోకేశ్.. ఎమ్మెల్సీ, ఏపీ మంత్రి అయ్యారని ట్వీట్ చేశారు.

'వర్ధంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడితే మీరన్నట్టు ప్రాజెక్టులేమీ ఆగిపోవు చిట్టి నాయుడు. ఇంతటి జ్ఞాని మనకు మంత్రిగా పనిచేశాడా? అని ప్రజల మనసులు క్షోభించాయి. విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడి కొడుకు అవడం వల్లనే ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడని అందరి అభిప్రాయం' అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

కాగా, తాను గతంలో వర్దంతిని జయంతి అనడం వల్ల ఏపీకి జరిగిన నష్టం ఏంటి? అని లోకేశ్ ఇటీవల నిలదీశారు. దీని వల్ల ఏపీకి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా? లేదంటే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అని ప్రశ్నలు సంధించారు.
Vijay Sai Reddy
Nara Lokesh
YSRCP

More Telugu News