Nara Lokesh: ఇలాగైతే శాసనమండలికి మేము రాము.. సభను మీరే నడుపుకోండి: నారా లోకేశ్

  • సభ్యులను అడ్డుకునే అధికారం మార్షల్స్ కు ఎవరిచ్చారు
  • ఎప్పుడూ లేని విధంగా గేటు వద్దే అడ్డుకుంటున్నారు
  • మహిళా సభ్యుల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు
శాసనమండలి సభ్యులను అడ్డుకునే అధికారం మార్షల్స్ కు ఎవరిచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రశ్నించారు. మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, మహిళా సభ్యుల పట్ల కూడా మార్షల్స్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా సభ్యులను గేటు వద్దే అడ్డుకోవడం దారుణమని చెప్పారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే సభకు తాము రాబోమని... సభను మీరే నడుపుకోవాలని అన్నారు.

మరోవైపు లోకేశ్ వ్యాఖ్యలపై శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ స్పందిస్తూ, సభ్యుల పట్ల మార్షల్స్ అగౌరవంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అన్నారు. మరోసారి ఇలా వ్యవహరించకుండా రూలింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఫ్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, చీఫ్ మార్షల్ ను పిలిపించి మాట్లాడతామని తెలిపారు.
Nara Lokesh
Telugudesam

More Telugu News