Chandrababu: నాకు ఇంగ్లీష్ రాదు సరే.. ఆయన ఇంగ్లీషులోనే పుట్టారు మరి: చంద్రబాబు

  • నేను వెంకటేశ్వర యూనివర్శిటీలో ఎంఏ చదివా
  • జగన్ ఎక్కడ చదివారో చెప్పాలి
  • జీవో పేరుతో మీడియా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు
జీవో 2430పై టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఆశ్చర్యకరంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఈ జీవోను చంద్రబాబు చదివారా? లేకపోతే ఇంగ్లీషును అర్థం చేసుకోవడంలో లోపం ఉందా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

 తాను వెంకటేశ్వర యూనివర్శిటీలో ఎంఏ చేశానని... జగన్ ఎక్కడ చదివారో చెప్పాలని ఎద్దేవా చేశారు. తనకు ఇంగ్లీష్ రాదు సరే.. ఆయన ఇంగ్లీషులోనే పుట్టారు మరి అని ఎద్దేవా చేశారు. ఈ జీవోను దేశ వ్యాప్తంగా ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారని... వారందరికీ ఇంగ్లీషు రానట్టేనా? అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే మీడియాను నియంత్రించేందుకు జీవో 938ను తీసుకొచ్చారని... పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో జీవోను ఆయన ఉపసంహరించుకున్నారని చెప్పారు. జీవో పేరుతో మీడియా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదని అన్నారు.
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News