Prakasam District: ప్రకాశం జిల్లాలో కారును ఢీ కొట్టిన లారీ...నలుగురి దుర్మరణం

  • మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు
  • బాధితులంతా కర్ణాటక రాష్ట్రం బళ్లారి వాసులుగా గుర్తింపు 
  • ప్రకాశం జిల్లా కొత్తపల్లి వద్ద ఘటన

కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులందరినీ కర్ణాటక రాష్ట్రం బళ్లారి వాసులుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. 

బళ్లారికి చెందిన పన్నెండు మంది కారులో శ్రీశైలం వెళ్లారు. అక్కడి మల్లికార్జున స్వామి దర్శనానంతరం తిరుమల వెంకన్న దర్శనానికి బయలుదేరారు. వీరి కారు కొత్తపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువుపాలయ్యారు. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.

Prakasam District
Road Accident
lorry car collued
four died

More Telugu News