అసోం సీఎం, కేంద్ర మంత్రి నివాసాలపై ఆందోళనకారుల దాడి.. ఆస్తుల ధ్వంసం
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు
- బీజేపీ నేతల నివాసాలపై దాడి
- రాష్ట్రంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు
తేలి నివాసంపై దాడి జరగక ముందే ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ నివాసంపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఆ పార్టీ నేత సుభాష్ దత్తా నివాసాలపై కూడా దాడికి తెగబడ్డారు. మరోవైపు, ఆందోళనలతో అట్టుడుకుతున్న అసోంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఈ బిల్లుకు సోమవారం లోక్ సభలో, నిన్న రాజ్యసభలో ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే.