Madhya Pradesh: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. అత్యాచారం చేసి భర్తకు అప్పగించిన తాంత్రికుడు

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
  • బాధితురాలిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
  • భర్త, తాంత్రికుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
భర్త తలాక్ చెప్పడంతో ఆవేదనలో మునిగిపోయిన వివాహితను భర్త దరికి చేరుస్తానంటూ ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిందీ ఘటన. భార్యతో జరిగిన గొడవ అనంతరం ఆవేశంతో భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనిని తనకు అవకాశంగా మార్చుకున్న ఓ తాంత్రికుడు.. వారి మధ్య ఉన్న గొడవను పరిష్కరిస్తానని నమ్మబలికాడు.

 అనంతరం ఆమె భర్తకు చెప్పి బాధితురాలిని తన ప్లాట్‌కు తీసుకెళ్లి ‘హలాలా’ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇప్పుడు సమస్య సద్దుమణిగిపోతుందని చెబుతూ ఆమెను భర్తకు అప్పగించాడు. అయితే, హలాలా అయిన భార్యతో తాను కాపురం చేయలేనని భర్త తెగేసి చెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తనపై అత్యాచారం చేసిన తాంత్రికుడితోపాటు, తలాక్ చెప్పిన భర్తపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Madhya Pradesh
triple talaq
black magic

More Telugu News