Telugudesam: అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనివ్వరు.. బూతులు తిడుతున్నారు: వైసీపీపై టీడీపీ నేత గోరంట్ల ఫైర్

  • ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారు
  • తోటి కులస్తులతో తిట్టిస్తున్నారు
  • రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు
ఏపీ అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వక పోగా బూతులు తిడుతున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారని, తోటి కులస్తులతో తిట్టిస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పాలనలో కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, దివాళా తీసే పరిస్థితి అని, సామాజిక వర్గాలకు న్యాయం జరగట్లేదని ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరులో ‘నాయుడు’ అని లేకపోయినా ఆ పదాన్ని చేర్చి పిలుస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telugudesam
Gorantla
YSRCP
Assembly

More Telugu News