అసోంలో సెగలు పొగలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఎఫెక్ట్!
- లోక్ సభ ఆమోదం పొందిన చట్టసవరణ బిల్లు
- అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు
- ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం
- అసోంకు భద్రతా బలగాల తరలింపు
10 జిల్లాల్లో బుధవారం రాత్రి 7 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు అలజడి రేకెత్తించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆ ప్రకటనలో వెల్లడించింది. శాంతిభద్రతలు అదుపు తప్పుతుండడంతో భద్రతా బలగాలను రంగంలోకి దించుతున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి సైన్యాన్ని అసోంకు తరలిస్తున్నారు.