బాలయ్య సినిమా కోసం బోయపాటి పారితోషికం 15 కోట్లు!
- 'రూలర్' గా రానున్న బాలకృష్ణ
- తదుపరి సినిమా బోయపాటితో
- హీరోయిన్ కోసం అన్వేషణ
70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకిగాను బాలకృష్ణ 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ ఉండగా, బోయపాటి పారితోషికం 15 కోట్లు అని తెలుస్తోంది. బాలకృష్ణ కంటే ఎక్కువ పారితోషికాన్ని ఆయన అందుకుంటూ ఉండటం, 'వినయ విధేయ రామ' వంటి భారీ పరాజయం తరువాత ఆయన ఆ స్థాయిలో డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ సరసన కీర్తి సురేశ్ ను అనుకున్నారు. అయితే ఆమె ఆసక్తిని చూపకపోవడం వలన, మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం.