Onions: కిలో ఉల్లి ఇవ్వడానికి వేలికి సిరా చుక్క వేస్తున్న సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు: నారా లోకేశ్

  • పెరిగిన ఉల్లి ధరలు
  • సబ్సిడీపై రైతు బజార్లలో విక్రయం
  • కొనుగోలు చేసిన వారి వేలికి సిరా చుక్క
పెరిగిన ఉల్లి ధరల నేపథ్యంలో ఏపీ సీఎంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లిని రాయితీపై అందిస్తుండగా ప్రజలు తొక్కిసలాడుకుంటుండడాన్ని ఇంతకుముందు ప్రస్తావించిన లోకేశ్, తాజాగా ఉల్లి కొనుగోలు చేస్తున్న వారి వేలికి సిరా చుక్క వేస్తుండడాన్ని ఎత్తిచూపారు.

సిరా చుక్కకి, ఓటుకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని, కానీ కిలో ఉల్లి ఇచ్చేందుకు వేలికి సిరా చుక్క వేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఉల్లి కోసం వేస్తున్న సిరా చుక్కే జగన్ అసమర్థ, చెత్త పాలనకు నిదర్శనం అని విమర్శించారు. అంతేకాదు, రాజమండ్రిలో రైతుబజార్ వద్ద ఉల్లి కొనుగోలు సందర్భంగా మహిళల వేలికి సిరా చుక్కను వేస్తున్న వీడియోను కూడా లోకేశ్ ట్వీట్ చేశారు.
Onions
Andhra Pradesh
Jagan
Ink Mark
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News