Roja: బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం లేదు: రోజా

  • కళాకారులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు
  • లోకేశ్ ను చూస్తుంటే నా కాళ్లు వణుకుతున్నాయి
  • మంగళగిరి అని పలకడానికి ట్యూషన్లు పెట్టించుకున్నారు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. 'లోకేశ్ ను చూస్తుంటే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంట.. నా కాళ్లు కూడా వణుకుతున్నాయి' అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మంగళగిరి అని పలకడానికి ట్యూషన్లు పెట్టించుకున్నారని అన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వడం లేదని... కళాకారులకు ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా  ప్రాజెక్టుల మీద కాకుండా రాయలసీమ ప్రాజెక్టులపై అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Roja
Balakrishna
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News