CCTV: ఉల్లిపాయలు చోరీ చేసిన దొంగలు.. సీసీ కెమెరాలో దృశ్యాలు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఉల్లి ధరలు పైపైకి 
  • ఉల్లిపై పడ్డ దొంగల దృష్టి
  • ముంబయిలో చోరీ
  • రూ.21,160 విలువ చేసే ఉల్లి స్వాధీనం

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పైపైకి వెళ్తుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొంగల దృష్టి ఉల్లిపాయలపై పడింది. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి దొంగలు బంగారాన్ని దోచుకోవడం గురించి మనం విన్నాం.. ఇప్పుడు వారు ఉల్లిపాయలను చోరీ చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని డొంగ్రీ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు దొంగలు ఉల్లిపాయలను చోరీ చేసి, అక్కడి సీసీ కెమెరాకు చిక్కారు.

ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి చివరకు వారిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.21,160 విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగలు దుకాణంలోకి ఉల్లిపాయల కోసం చొరబడిన వీడియో మీడియాకు లభ్యమైంది.

More Telugu News