Nara Lokesh: జగన్ గారు ఏమీ రాని గన్నేరు 'పప్పు' అని తేలిపోయింది: నారా లోకేశ్

  • జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లిష్, లెక్కల్లోనూ వీకే 
  • అన్నింటిలో జీరో అయిన జగన్ గారు ఏ పప్పో వైకాపా తేల్చుకోవాలి
  • జగన్ ప్రసంగాల వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లిష్, లెక్కల్లోనూ వీకే. జగన్ గారు ఏమీ రాని గన్నేరు పప్పు అని తేలిపోయింది. అన్నింటిలో జీరో అయిన జగన్ గారు ఏ పప్పో వైకాపా పెయిడ్ ఆర్టిసులు, పేటీఎమ్ బ్యాచ్ తేల్చుకోవాలి' అని ఆయన ట్వీట్ చేశారు. పలు సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన లెక్కలకు సంబంధించిన వీడియోను నారా లోకేశ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

కాగా, ఏపీలో పెంచిన ఆర్టీసీ ధరలు తగ్గించాలని అసెంబ్లీ ఎదురుగా తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నానంటూ నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు. 'గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్టు... ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజలపై జగన్ గారు ఆర్టీసీ ఛార్జీల భారం వేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి' అని అన్నారు.

'15 కిలోమీటర్లకు పెంచిన ధర ప్రకారం రూపాయిన్నర పెరగాలి. కానీ ఐదు రూపాయిలు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు నా దృష్టికి తీసుకొచ్చారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ప్రయాణికులకు తెలిపాను. జగన్ గారు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. ప్రజలపై సంవత్సరానికి వెయ్యి కోట్ల భారం పెరిగింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ మంగళగిరి నుండి అసెంబ్లీకి బస్సులో టీడీపీ ఎమ్మెల్సీలతో ప్రయాణించాను' అని లోకేశ్  వివరించారు.
Nara Lokesh
YSRCP
Telugudesam
Jagan

More Telugu News