రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా.. ముస్లింలు భయపడక్కర్లేదని వ్యాఖ్య
- ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకం కాదు
- తప్పుడు ప్రచారాన్ని ముస్లింలు నమ్మవద్దు
- ఈ బిల్లుతో శరణార్థులకు న్యాయం జరుగుతుంది
ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టినట్టు కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ ముస్లింలు ఎవరూ తప్పడు ప్రచారంతో ఆందోళనకు గురి కావద్దని కోరారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ఉన్న మైనార్టీల కోసమే ఈ బిల్లు అని చెప్పారు. ముస్లిం శరణార్థులందరికీ భారత్ ఆశ్రయం కల్పించలేదని చెప్పారు.
కొన్ని దశాబ్దాలుగా శరణార్థులకు మన దేశంలో అన్యాయం జరుగుతోందని అమిత్ షా అన్నారు. ఈ బిల్లుతో వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు.