CAB: రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా.. ముస్లింలు భయపడక్కర్లేదని వ్యాఖ్య

  • ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకం కాదు
  • తప్పుడు ప్రచారాన్ని ముస్లింలు నమ్మవద్దు
  • ఈ బిల్లుతో శరణార్థులకు న్యాయం జరుగుతుంది

పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు తమ మేనిఫెస్టోలో ఉందని చెప్పారు. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని... ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే పని చేస్తుందని చెప్పారు. మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు.

ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టినట్టు కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ ముస్లింలు ఎవరూ తప్పడు ప్రచారంతో ఆందోళనకు గురి కావద్దని కోరారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ఉన్న మైనార్టీల కోసమే ఈ బిల్లు అని చెప్పారు. ముస్లిం శరణార్థులందరికీ భారత్ ఆశ్రయం కల్పించలేదని చెప్పారు.

కొన్ని దశాబ్దాలుగా శరణార్థులకు మన దేశంలో అన్యాయం జరుగుతోందని అమిత్ షా అన్నారు. ఈ బిల్లుతో వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

More Telugu News