హైదరాబాద్లో దారుణం.. భార్యకు ఉరేసి, కుమారుడికి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన కసాయి
- గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఘటన
- భార్యాకుమారుడిని చంపి ఆత్మహత్యాయత్నం
- నిందితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి కుమారుడి వయసు ఏడాదిన్నర ఉంటుందని వివరించారు. ఆ వ్యక్తి ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం గురించి తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.