Nani: మరో యువ దర్శకుడిని లైన్లో పెట్టిన నాని

షార్ట్స్‌లో చూడండి
అప్పుడప్పుడూ అపజయాలు ఎదురైనా, నాని కొత్త కథలను ఎంచుకుంటూ .. యువ దర్శకులకు అవకాశాలనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందుతున్న 'వి' .. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా నాని సెట్ చేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' సినిమాను చేసిన రాహుల్ సాంకృత్యాన్, ఇటీవల నానీని కలిసి ఒక కథను చెప్పాడట. ఆ కథ కొత్తగా ఉండటం .. తను ఇంతవరకూ చేయని పాత్ర కావడం వలన వెంటనే నాని ఒప్పేసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అవి పూర్తి కాగానే అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Nani
Rahul sankrithyayan

More Telugu News