Anil Ravipudi: శ్రీను వైట్ల ఆ మాట అన్నప్పుడల్లా నాకు బాధగా అనిపిస్తూ ఉంటుంది: దర్శకుడు అనిల్ రావిపూడి

  • 'ఆగడు' సినిమా ఫస్టాఫ్ వరకే పనిచేశాను 
  • 'పటాస్' చేసే ఛాన్స్ అప్పుడే వచ్చింది 
  • 'ఆగడు' కోసం నేను కాస్త ఆగితే బాగుండేదన్న అనిల్ రావిపూడి
'పటాస్' సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకుముందు ఆయన స్క్రిప్ట్ డిపార్ట్ మెంట్లో వుంటూ కొన్ని సినిమాలకి పనిచేశాడు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'ఆగడు' సినిమాకి కూడా పనిచేశాడు. తాజాగా ఆయన ఆ సినిమాను గురించి ప్రస్తావించాడు.

'ఆగడు' సినిమాకి ఫస్టాఫ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసే సమయానికి, 'పటాస్' సినిమాకి దర్శకుడిగా చేసే అవకాశం లభించింది. దాంతో నేను 'ఆగడు' సెకండాఫ్ కి పనిచేయకుండా వెళ్లిపోయాను. ఇప్పటికీ శ్రీను వైట్ల గారు ఎక్కడ కనిపించినా, 'ఏమయ్యా అప్పుడు నాతో సెకండాఫ్ కి కూర్చోకుండానే వెళ్లిపోయావ్ గా .. నీ అంతు చూస్తా' అంటూ వుంటారు. అలా అన్నప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే నేను 'ఆగడు' సెకండాఫ్ కి సమయాన్ని కేటాయించి వుంటే, ఆ సినిమా హిట్ అయ్యేదేమోనని అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Anil Ravipudi
Srinu Vaitla

More Telugu News