Chandrababu: ఏ పని చేసినా విమర్శిస్తున్నారు: జగన్

  • ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు
  • బినామీ నారాయణతో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెట్టించారు
  • ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నా
తమ ప్రభుత్వం ఏ పని చేసినా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చర్చ కోసం టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో శాసనసభ వేడెక్కింది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పేదవాళ్లు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తాము భావిస్తున్నామని... దీనిపై చంద్రబాబు నిర్ణయం దారుణమని అన్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లను ఆయన ప్రోత్సహించారని విమర్శించారు. ఆయన బినామీ నారాయణతో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెట్టించారని తెలిపారు. సమాజంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరమని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
Chandrababu
Jagan
YSRCP
Telugudesam

More Telugu News