anammirja: అక్క సానియా మీర్జాను దాటిన ఆనం క్రేజ్.. నెట్టింట మెహందీ ఫొటోలు వైరల్!

  • క్రికెటర్ అహరుద్దీన్ తనయుడితో నేడు వివాహం 
  • నిన్న ఆనం ఇంట మెహందీ వేడుక 
  • నెట్లో ఫొటోలకు ఇప్పటికే లక్ష దాటిన లైక్స్

టెన్నిస్ స్టార్ సానియామీర్జాను తలదన్నే క్రేజ్ ఆమె చెల్లెలు ఆనం మీర్జాకు కనిపిస్తోంది. అక్క పాప్యులారిటీ వల్లో, చేసుకోబోయే వాడు క్రికెటర్ అజహరుద్దీన్ కొడుకు కావడం వల్లనోగాని పెళ్లి ముందు జరిగిన ఆమె మెహందీ ఫొటోలకు నెటిజన్లు తెగ లైక్ లు కొట్టేస్తున్నారు. 

అజహరుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్, సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జాలు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఈ రోజు, రిసెప్షన్ రేపు జరగనున్నాయి. వివాహంలో భాగంగా నిన్న రాత్రి ఆనం ఇంట గోరింటాకు పండగ (మెహందీ) జరిగింది. ఈ ఫంక్షన్లో నీలంరంగు లంగావోణీతో ఆనం మీర్జా అదరగొట్టింది. 

అలాగే సానియా మీర్జా చంటిబిడ్డతోను, ఆమె తల్లిదండ్రులు ఈ ఫంక్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫంక్షన్ ఫొటోలను సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ లో పెడితే ఇప్పటికే లైక్ కొట్టిన వారి సంఖ్య లక్ష దాటేయడం విశేషం.

anammirja
mehendi
Sania Mirza
ajahruddin

More Telugu News