Uttar Pradesh: బాలికను వేధిస్తున్న ప్రబుద్ధుడిని పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదిన మహిళా కానిస్టేబుల్!

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • స్కూలుకు వెళ్తున్న బాలికలను వేధిస్తున్న రోమియో
  • పట్టుకుని బూటుతో చితకబాదిన కానిస్టేబుల్
బాలికలను వేధిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్న మహిళా కానిస్టేబుల్ నడిరోడ్డుపై అతడిని చితకబాదిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిందీ ఘటన. బీతూరులో బాలికలు పాఠశాలకు వెళ్తున్న సమయంలో వారితో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు.

దీనిని గమనించిన మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా నడిరోడ్డుపై అతడిని చితకబాదింది. అనంతరం తన కాలిబూటు తీసి 22 సార్లకుపైగా ముఖంపై కొట్టింది. తర్వాత అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించింది. నిందితుడిని చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Uttar Pradesh
kanpur
woman constable

More Telugu News