uppal: ఉప్పల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి

  • గాయాలతో వరంగల్ రహదారిపై పడివున్న విద్యార్థి
  • గాంధీ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారన్న విద్యార్థి
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వరంగల్ రహదారిపై గాయాలతో పడి ఉన్న విద్యార్థి షేక్ ఇమ్రాన్‌ను సోమవారం రాత్రి గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం మృతి చెందాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసినట్టు చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు ఇమ్రాన్ తెలిపాడు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఇమ్రాన్ మహబూబాబాద్ జిల్లా వాసి. ఉప్పల్ భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ హయత్‌నగర్‌లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
uppal
Hyderabad
student
murder

More Telugu News