Hyundai car price Hike from 2020 January: వచ్చే ఏడాది ప్రారంభంలో పెరగనున్న హ్యూందాయ్ కార్ల ధరలు

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ ఇండియా తన ఉత్పత్తుల ధరలను వచ్చే ఏడాది జనవరిలో పెంచనున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగటంతో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు ఉంటుందన్నది స్పష్టం చేయలేదు.

ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. ‘దేశంలోనే తొలి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ అందజేస్తున్న హ్యూందాయ్ మోటార్స్ ఇండియా జనవరి 2020 నుంచి అన్ని మోడళ్లపై ధరలను పెంచుతోంది. ముడిసరుకుల ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Hyundai car price Hike from 2020 January

More Telugu News