Chandrababu: చంద్రబాబునాయుడుగారిలో ఏదో తేడా కనిపిస్తోంది: అంబటి రాంబాబు చురక

  • చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు
  • ముఖ్యమంత్రిగారిని చూసి  ‘లే..లే..లే’ అంటున్నారు
  • ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నట్టు బాబు ప్రవర్తిస్తున్నారు
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ‘ఉదయం నుంచి చూస్తున్నా.. చంద్రబాబునాయుడుగారిలో ఏదో తేడా కనిపిస్తోంది. రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఉదయం కూడా ముఖ్యమంత్రిగారిని చూసి  ‘లే..లే..లే’ అంటున్నారు. ఉదయం నుంచి గమనిస్తున్నా.. వారు (చంద్రబాబునాయుడు) చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నట్టు వీరు ప్రవర్తిస్తున్నారు.. వీరి అబ్బాయి ఏమో డెబ్బై ఏళ్లలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘నాకు ప్రధాన ప్రతిపక్ష నేత ఇవాళ చాలా బాగా నచ్చారు. ఎందుకంటే, అసత్యాలను చాలా సునాయాసంగా మాట్లాడేస్తున్నారు. ఇందులో వీరిని మించిన దిట్ట నాకు ఇంతవరకూ ఎవరూ కనిపించలేదు. ఇంతకుముందు చేసిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేదంటే వారికి (చంద్రబాబునాయుడు) కోపమొచ్చేసింది’ అంటూ విమర్శలు చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Ambati

More Telugu News