Andhra Pradesh: ఏపీలో ఈ ఆరు నెలల్లో 260 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: నారా లోకేశ్

  • గిట్టుబాటు ధర లేక రైతులకు దిక్కుతోచట్లేదు
  • ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది
  • వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఏపీ ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాల వల్ల ఈ ఆరునెలల్లో 260 మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా రైతులను దగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ, ఈరోజు అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Jagan

More Telugu News