Vallabhaneni Vamsi: నా మాటలు వినలేక చంద్రబాబు ఎందుకు వెళ్లిపోయారు?: వల్లభనేని వంశీ
- నేను ఇప్పటికీ టీడీపీ సభ్యుడినే
- ఒక నిమిషం మాట్లాడతానంటే టీడీపీ వారికి భయమెందుకు?
- చంద్రబాబుకు ఒక్కరికే హక్కులు ఉంటాయా?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పప్పు అనే ఒక బ్యాచ్ ఉందని... వాళ్లు బయట తిరగరని, ట్విట్టర్లో మాత్రమే కనపడతారని అన్నారు. జయంతికి, వర్ధంతికి కూడా వారికి తేడా తెలియదని చెప్పారు.
తాను కూడా టీడీపీ ఎమ్మెల్యేనేనని... ఒక నిమిషం సభలో మాట్లాడేందుకు సమయం అడిగితే టీడీపీ వారికి ఎందుకంత అభ్యంతరమని ప్రశ్నించారు. తాను మాట్లాడతానంటే టీడీపీ వారికి అంత ఉలుకెందుకని ప్రశ్నించారు.
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు గారికి అంత భయం ఎందుకు సార్? అని వంశీ ప్రశ్నించారు. తన మాటలను వినలేక ఆయన బయటకెందుకు వెళ్లిపోయారు సార్? అని అడిగారు. ఆయన ఒక్కరికే హక్కులు ఉంటాయా? మాకు హక్కులు ఉండవా? అని ప్రశ్నించారు.