Vijay Devarakonda: తమ్ముడితో కలిసి నటించనున్న విజయ్ దేవరకొండ?

  • 'దొరసాని' సినిమాతో పరిచయం 
  • సోలో హీరోగా సెట్స్ పై మరో సినిమా 
  • త్వరలో రానున్న క్లారిటీ    
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాగా పూరి దర్శకత్వంలో 'ఫైటర్' రూపొందనుంది. ఈ నేపథ్యంలోనే శివ నిర్వాణ దర్శకత్వంలోను ఒక సినిమాను చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ రెండు సినిమాల్లో ఒక దాంట్లో మాత్రం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడని అంటున్నారు. అది పూరి సినిమానా? శివ నిర్వాణ మూవీనా? అనే విషయంలోను, ముఖ్యమైన పాత్రనా? అతిథి పాత్రనా? అనే విషయంలోను క్లారిటీ రావలసి వుంది. 'దొరసాని' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ, సోలో హీరోగా మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda
Anand Devarakonda

More Telugu News