Saudi Arabia: రెస్టారెంట్లలో ఇకపై ఒకటే క్యూ... మరో నిబంధన సడలించిన సౌదీ అరేబియా

  • సౌదీ రెస్టారెంట్లలో ఇప్పటివరకు రెండు ద్వారాలు, రెండు క్యూలు
  • ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు!
  • క్రమంగా మహిళలపై ఆంక్షలు ఎత్తివేస్తున్న సౌదీ
మహిళలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండే దేశంగా పేరొందిన సౌదీ అరేబియా ఇటీవల ఉదారంగా వ్యవహరిస్తోంది. మహిళలపై ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తోంది. తాజాగా, రెస్టారెంట్లలో ఇకపై ఒకటే క్యూ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూలు ఏర్పాటు చేసేవాళ్లు. ప్రతి రెస్టారెంట్ లోనూ రెండు ప్రవేశద్వారాలు, రెండు క్యూలు ఉండేవి. ఒకటి పురుషుల కోసం, మరొకటి కుటుంబాలతో వచ్చినవాళ్లు, ఒంటరి మహిళల కోసం కేటాయించేవాళ్లు. ఇప్పుడీ రెండు మార్గాలు, రెండు క్యూల నిబంధనను సడలిస్తూ సౌదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే, పురుషులు రెస్టారెంట్లలో ఒంటరి మహిళల పక్కనే కూర్చోవడం మాత్రం ఇప్పటికీ నిషిద్ధమే!
Saudi Arabia
Men
Women
Que
Entrance
Restaurant

More Telugu News