Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు

  • నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పేరిట కొత్త శాఖ
  • పాలనా సౌలభ్యం కోసం నిర్ణయం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలో పాలనా సౌలభ్యం కోసం మరో ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట నూతన పాలనాశాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వ శాఖ పర్యవేక్షించనుంది. అంతేగాకుండా, యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు శిక్షణ అంశాన్ని కూడా ఈ కొత్త శాఖ చేపట్టనుంది. ఈ పాలనా శాఖ కోసం ఒక కార్యదర్శి, ఒక అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బందిని కూడా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఇది 37వది.
Andhra Pradesh
Govt
Jagan
YSRCP

More Telugu News