Sajjanar: సజ్జనార్ పై మర్డర్ కేసు నమోదు చేయండి: 'నేను సైతం' స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు

  • దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు
  • సజ్జనార్ తో పాటు మరో నలుగురు అధికారులపై కేసు నమోదు చేయాలని విన్నపం
  • ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు

దిశ హత్య కేసు నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ ను దేశ వ్యాప్తంగా పలువురు స్వాగతిస్తుండగా... మరి కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ కూడా జరుపుతోంది.

మరోవైపు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాదుకు చెందిన 'నేను సైతం' స్వచ్చంద సంస్థ ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారని... ఈ ఘటనలో సజ్జనార్ తో పాటు నలుగురు పోలీసు అధికారులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ కోరారు. అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News