Karnataka: ప్రజలు ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చారు: ఉప ఎన్నికల ఫలితాలపై డీకే శివకుమార్

  • తిరుగులేని ఆధిక్యం దిశగా బీజేపీ 
  • స్పందించిన డీకే శివకుమార్
  • ఓటమిని అంగీకరిస్తున్నాం
  • ఈ ఓటమితో మేము ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు
కర్ణాటకలో అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తిరుగులేని ఆధిక్యం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో ఒక స్థానంలో గెలిచిన బీజేపీ, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. జేడీఎస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. ఉప ఎన్నికల ఫలితాలపై కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించారు.

డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము అంగీకరించాల్సి ఉంది. అయితే, ప్రజలు ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చారు. మేము మా ఓటమిని ఒప్పుకుంటున్నాం. ఈ ఓటమితో మేము ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు. 
Karnataka
Congress
DK Shivakumar

More Telugu News