Vallabhaneni Vamsi: అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లోనే కూర్చున్న వల్లభనేని వంశీ

  • కాసేపటి క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • పీపీఏలపై అట్టుడుకుతున్న సభ
  • టీడీపీకి కేటాయించిన స్థానాల్లో వెనుక వరుసలో కూర్చున్న వంశీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలపై సభ అట్టుడుకుతోంది. మరోవైపు, టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో... వెనుక వరుసలో ఆయన కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వంశీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన పొలిటికల్ కెరీర్ ప్రారంభం నుంచి టీడీపీలోనే కొనసాగిన వంశీ... చంద్రబాబుపై చేసిన విమర్శలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.
Vallabhaneni Vamsi
Telugudesam
Assembly

More Telugu News