Kodali Nani: టీడీపీలో ప్రతి ఒక్కరూ అంతే... వాళ్లకు మామూలు భాషలో చెబితే అర్థం కాదు: కొడాలి నాని

  • కొడాలి నాని ఇంటర్వ్యూ
  • తనకు కోపం అంటే తెలియదని వెల్లడి
  • తన మాటతీరు కరకుగా ఉంటుందన్న కొడాలి
తనకు కోపం అంటే తెలియదని, ఎప్పుడూ కోపం రాదని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తనకు సున్నితంగా మాట్లాడడం తెలియదని, మాట కొంచెం కరకుగా ఉండడంతో అందరూ కోపం అనుకుంటారని వివరించారు. కొందరికి వాడుక భాషలో చెబితేనే అర్థమవుతుందని, అలాంటివాళ్లతో తాను అలాగే మాట్లాడతానని తెలిపారు. ముఖ్యంగా, టీడీపీలో చంద్రబాబు సహా ఇతర నేతలందరూ అంతేనని, వాళ్లపై తన మాటతీరు కరకుగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను టీడీపీలో ఉన్నప్పటి నుంచి వాళ్లలో ఏ మార్పు లేదని, వారి పద్ధతి నచ్చకే తాను బయటికొచ్చానని వివరించారు.

Kodali Nani
Telugudesam
Andhra Pradesh
YSRCP
Chandrababu
Jagan

More Telugu News