New Delhi: పరారైన భవన యజమానిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

  • ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
  • 43 మంది దుర్మరణం
  • 60 మందికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదం 43 మందిని బలితీసుకుంది. మరో 60 మంది వరకు గాయాలపాలయ్యారు. ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో చెలరేగిన మంటలు కొద్దిసేపట్లోనే భవనం మొత్తం పాకిపోయాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే భవన యజమాని రేహాన్ పరారయ్యాడు. అయితే ఈ సాయంత్రం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన భవనానికి ఫైర్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ లేదని గుర్తించారు. కాగా, ప్రమాద తీవ్రత దృష్ట్యా సుమారు 30 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు రంగంలో దిగాల్సి వచ్చింది.
New Delhi
Fire Accident
Police
Rehan

More Telugu News