Tollywood: ‘ఎంత మంచి వాడవురా’ తొలి సాంగ్ విడుదల

  • హీరో కల్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’
  • ‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ..’ పాట విడుదల
  • ‘ఎంత మంచి వాడవురా’ దర్శకుడు సతీశ్ వేగేశ్న 
హీరో కల్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ మూవీ నుంచి తొలి సాంగ్ విడుదలైంది. ‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం..’ అంటూ సాగిన ఈ పాటను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. సతీశ్ వేగేశ్న దర్వకత్వంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ సరసన మెహరీన్ నటిస్తోంది. శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Tollywood
Hero
Kalyanram
Meharin

More Telugu News