New Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

  • ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
  • ప్లాస్టిక్ కర్మాగారంలో మంటలు
  • 43 మంది దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదం ప్రధాని మోదీని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్లాస్టిక్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం 43 మందిని పొట్టనబెట్టుకుంది. 60 మంది వరకు గాయపడ్డారు. పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరై అత్యధికులు మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
New Delhi
Fire Accident
Narendra Modi
Arvind Kejriwal

More Telugu News