New Delhi: ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వండి: కేజ్రీవాల్ ఆదేశం

  • విచారణకు ఆదేశించాను 
  • గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం
  • ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తాం 
ఢిల్లీలోని అనాజ్ మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలిని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందర్శించారు. అక్కడి సహాయక చర్యలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

'ఇది చాలా బాధాకర ఘటన. దీనిపై విచారణకు ఆదేశించాను. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాను. అలాగే, గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున అందిస్తాం. వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తాం' అని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
New Delhi
Arvind Kejriwal
Fire Accident

More Telugu News