lk advani: ఎల్కే అద్వాణీకి సంబంధించి అభ్యంతరకర ఫొటో పోస్ట్.. విద్యార్థి సహా ఇద్దరిపై కేసు

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఏఎంయూ విద్యార్థిని గుర్తించిన పోలీసులు
  • బీజేపీ నేత ఫిర్యాదు మేరకు దర్యాప్తు 
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీకి సంబంధించి అభ్యంతరకర రీతిలో ఫొటోను పోస్ట్ చేసిన ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కూడా ఉన్నాడు.

ఈ ఘటనపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... 'బీజేపీ నేత ప్రతీక్ చౌహాన్ చేసిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశాం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ చర్యకు పాల్పడిన వారిలో ఒకరు ఏఎంయూ విద్యార్థి అని తేలింది. రెండో వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం' అని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర ఫొటోలు, పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటున్నారు.
lk advani
Uttar Pradesh
student

More Telugu News