Uttar Pradesh: 'అత్యాచారం జరిగిన తరువాత రా చూద్దాం'... ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతితో పోలీసు!

  • యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో ఘటన
  • యువతిని అటకాయించిన ఐదుగురు
  • వారి పేర్లు చెప్పి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం
తనను అటకాయించిన కొందరు అత్యాచారం చేయాలని చూశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువతి, స్టేషన్ లో తీవ్ర అవమానానికి గురైంది. తాను మందులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా, ఐదుగురు దారికాసి అత్యాచారం చేయాలని చూశారని చెప్పిన ఆమె, ముగ్గురి పేర్లను కూడా చెప్పింది. దీనిపై కేసునమోదుకు అంగీకరించని పోలీసులు, అత్యాచారం జరుగలేదుగా అని అవమానించారు. ఆపై రేప్ జరిగిన తరువాత రావాలని, అప్పుడు కేసు పెడతామని అన్నారని బాధితురాలు వాపోయింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగింది. అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవదహనం చేసిన 36 గంటలు తిరగకుండానే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. ఘటన జరిగిన వెంటనే తాను 1090కి ఫోన్ చేస్తే, వారు 100కు కాల్ చేయాలని చెప్పారని, 100కు ఫోన్ చేస్తే, ఘటన ఎక్కడైతే జరిగిందో, ఆ పరిధిలో ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారని ఆమె వెల్లడించింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలుసుకున్న నిందితులు, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
Uttar Pradesh
Rape
Police

More Telugu News