నిర్మాణ కౌశలానికి ప్రతీకలా రాజస్థాన్ కొత్త హైకోర్టు భవనం... ఓ లుక్కేయండి!
- సరికొత్త డిజైన్ లో రాజస్థాన్ హైకోర్టు
- నిర్మాణానికి రూ.316 కోట్ల వ్యయం
- ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
వాస్తవానికి ఈ హైకోర్టు సెప్టెంబరులో ప్రారంభించాలనుకున్నారు. ఆ సమయంలో సీజేఐగా ఉన్న రంజన్ గొగోయ్ ను కూడా ఆహ్వానించాలని భావించారు. కానీ ప్రారంభోత్సవం వాయిదాపడడం, రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. కాగా, ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా హాజరయ్యారు.


